18-05-2025 11:20:40 PM
నేషనల్ అంబేద్కర్ సేన ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించ కుండా అవమానించిన దేవాదాయశాఖ అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని నేషనల్ అంబేద్కర్ సేన ప్రధాన కార్యదర్శి తుంగపిండి రాజేష్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల ఆహంకార ధోరణితో పెద్దపెల్లి ఎంపీ వంశీ కృష్ణ ని పనిగట్టుకుని పుష్కరా లకు ఆహ్వానించకుండా అవమానించారని, ప్రోటోకాల్ అమలు చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
పెద్దపల్లి ఎంపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక అడుగడు గునా అవమానాలకు గురిచేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం పెద్దపల్లి ఎంపీ పేరును ఫ్లెక్సీల పై ఏర్పాటు చేసి పుష్కరాలకు ఆహ్వానించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడం అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని ఆయన అధికారుల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులైన దేవాదాయ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాలేశ్వరం ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.