18-05-2025 10:54:27 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా ప్రభుత్వం వేతనాలు ఇచ్చేదా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వేం నరేందర్ రెడ్డిని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు కలిసి, విద్యా బోధన మెరుగ్గా చేస్తూ, పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులైన కృషి చేస్తున్న తమకు ప్రతినెల వేతనం ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు.