calender_icon.png 19 May, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఘాతుకంతో 13 గేదెలు మృతి

18-05-2025 10:51:04 PM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): విద్యుత్ ఘాతుకంతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం13 గేదెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్ళితే పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి సమీపంలోని అమరావాది శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో ఘటన చోటుచేసుకుంది. అమరావాది గ్రామానికి చెందిన సుమారు 11 మంది రైతులకు సంబంధించిన 13 గేదెలు ఉన్నట్లు సమాచారం. రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడైన ఓ కౌలు రైతులు ఈ వ్యవసాయ క్షేత్రంలో కూరగాయల సాగు చేయగా, రైతు వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ తీగలు అమార్చగా ప్రమాదవశాత్తు వైర్లు పక్కనున్న చెరువులో పడగా దాహం తీర్చుకొనేందుకు చెరువులోకి దిగిన గేదెలకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తమ ఉపాధి కోల్పోయమని, ఆర్థికంగా నష్టపోయామని వారు ఆవేద చెందుతున్నారు.