calender_icon.png 19 May, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా మెడికల్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

18-05-2025 11:07:21 PM

మునగాల: సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన  మునగాలలో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ హాస్పటల్లో మాఫియా నడుస్తుందని ఎంబీబీఎస్ ఎండి సర్టిఫికెట్లు లేకున్నా హాస్పటలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాలలో కూడా అనుమతులు సరైన పత్రాలు లేకుండా హాస్పటల్లో స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నారని అన్నారు. అవసరం లేకున్నా వివిధ పరీక్షలు నిర్వహించాలంటూ హాస్పటల్ స్కానింగ్ సెంటర్లు ల్యాబ్లు ప్రజల దగ్గర రక్తం పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత దోపిడీ జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ  నీ సస్పెండ్ చేయాలని ఆయన మీద విచారణ కమిటీ వేసి విచారణ జరపాలని ప్రైవేట్ హాస్పటల్లో డబ్బుల దోపిడి అరికట్టాలని వారానికి ఒకసారి హాస్పటల్లో స్కానింగ్ సెంటర్లలో ల్యాబ్లలో విచారణ చేసి సరైన ధ్రువపత్రాలు ఉన్నాయా లేవా అని అలాగే ఫీజుల దోపిడిని  అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్పటల్లో డబ్బులు చెల్లించక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాలు ఇప్పటికైనా పారదర్శకంగా వ్యవహరించి ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.