20-12-2025 02:22:43 AM
ఒమన్ పర్యటనలో ఆసక్తికర ఫొటో
సోషల్ మీడియాలో వైరల్
మస్కట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మస్కట్ విమానాశ్రయం లో ఆయనకు ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్ స్వాగతం పలుకుతున్న వేళ.. మోదీ చెవికి చెవిరింగ్‌ను పోలిన ఆభరణమొకటి కనిపించింది. ప్రతి దేశ పర్యటనలో మోదీ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ అవలంబిస్తారన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన తాజా చిత్రం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘మోదీ చెవి రింగ్ పెట్టుకున్నారు..’ అంటూ నెటిజన్లు ఫొటోను జూమ్ చేసి చూడటం మొదలు పెట్టారు. మొత్తానికి తేలిందేమిటంటే.. మోదీ చెవిన ఉన్నది ఆభరణం కాదు.. అదొక ‘రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ డివైస్’ (భాషను తర్జుమా చేసే యంత్రం). పర్యటనలో మోదీ మరోవైపు ఒమన్‌తో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ కుదుర్చుకున్నారు. మోదీకి అనంతర ఒమన్ సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ ప్రదానం చేసి గౌరవాభిమానాలు చాటుకున్నారు.