08-11-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు,నవంబరు7(విజయక్రాంతి):జనవరిలో జరగబోయే మేడారం జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీసమ్మక్క సారలమ్మ మేడారం జాతర_ 2026 ముందస్తు ప్రణాళిక తయారులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరిలో జరగబోయే మేడారం జాతరలొ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గతంలో జరిగిన జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ప్రణాళికలను తయారుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని దానికి సంబంధించి సిబ్బందిని మందులను, పరికరాలను బెడ్స్ ను సమకూర్చుకోవాలని తెలిపారు. అత్యవసర చికిత్స నిమిత్తం 108 ప్రభుత్వ వాహనాలను అంబులెన్స్లను అందుబాటులో చూసుకోవాలని తెలిపారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ములుగు జిల్లాను ముందు వరుసలో ఉంచాలని వైద్యాధికారులను కోరారు. పనిపట్ల అలసత్వం వహించే సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యాధికారులు మరియు సూపర్వైజర్స్ ప్రతివారం సమీక్ష సమావేశాలను సిబ్బందితో నిర్వహించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విపిన్ కుమార్, ఐటిడిఏ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ క్రాంతి కుమార్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రణధీర్, డెమో సంపత్, మానిటరింగ్ సూపర్వైజర్ సురేష్ బాబు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్స్, ఆర్బిఎస్కే ఎంసీఏ ప్రోగ్రాం డాక్టర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్స్, ఆరోగ్య కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.