24-07-2025 12:50:33 AM
మహబూబాబాద్, జూలై 23 (విజయ క్రాంతి): 11 ఏళ్ల నిరీక్షణకు ఇందిరమ్మ ప్రజారాజ్యం తెరదించిందని, నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డుతో భరోసా కల్పించిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. బుధవారం గూడూరు మండల కేంద్రంలో నూతనంగా పేద కుటుంబాలకు మంజూరైన రేషన్ కార్డు ధ్రువపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా రేషన్ కార్డు అండగా ఉంటుందని, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోగా, కనీసం కుటుంబాల్లో పుట్టిన పిల్లలను కూడా కొత్తగా నమోదు చేయలేదని, దీనివల్ల లక్షల మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేకపోయారన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. తహసిల్దార్ నాగ భవాని, ఎంపీడీవో కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.