calender_icon.png 26 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరాకపోతే దేశవ్యాప్త ఉద్యమం

25-07-2025 12:53:15 AM

  1. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం 
  2. కులగణన, బీసీ రిజర్వేషన్లపై రాహుల్, ఖర్గేతో టీ కాంగ్రెస్ నేతల సమావేశం 
  3. అసెంబ్లీలో తీర్మానం, ఆర్డినెన్స్ తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి వివరణ  

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసిం ది. ఓ వైపు పార్టీ అధిష్ఠానం నుంచి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొ స్తునే.. మరోవైపు దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయానికి వచ్చింది.

ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నివాసంలో గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొ న్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహ రి, ప్రొఫెసర్ కంచ ఐలయ్య తదితరులు స మావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన కులగణన తీరుతెన్నులను వకా బు చేశారు.

రాష్ట్రంలో ఏయే కులాలకు చెం దిన వారు ఎంత శాతం ఉన్నారు? ఎస్సీ, ఎ స్టీ జనాభా ఎంత ఉంది? తదితర పూర్తి స మాచారాన్ని అడిగి తెలసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే, ఎంపైరికల్ డేటా ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, వి ద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కో సం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వా రా కేంద్ర ప్రభుత్వానికి పంపిన అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపైన సీఎం రేవం త్‌రెడ్డి వివరించారు.

సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై క్యాబినెట్‌లో ఆమో దం తెలిపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపిన విషయాన్ని మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అనివార్యతను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ ఉభయ సభ ల్లో ఆమోదం తర్వాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తి డి తీసుకురావాలని కోరారు. 

అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. ఇక్కడ వ్యతిరేకించడమా? 

బీజేపీపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆగ్రహం 

తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ బిల్లు కు కేంద్రం ఆమోదం తెలపకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఏఐసీ సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, రెండు బిల్లులు తీసు కువచ్చామని చెప్పారు.

ఆ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. బీసీ రిజ ర్వేష న్లకు బీజేపీ వ్యతిరేకమన్న విషయం స్ప ష్టం గా అర్థమవుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ, జాతీయ స్థా యిలో మరోమాట మాట్లాడుతుందని  దుయ్యబట్టారు.

ఉమ్మడి రాష్ట్రంలో బీ సీల రిజర్వేషన్లను తగ్గించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ కూడా యూటర్న్ తీసుకుంటుందని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ స్ఫూ ర్తితోనే తెలంగాణలో కులగణన చేశామని, బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. 

తెలంగాణ మోడల్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

పార్టీ పెద్దలతో గేమ్ చేంజర్ సమావేశం: సీఎం రేవంత్‌రెడ్డి 

ఓబీసీల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పూర్తి మద్దతు, నిబద్ధతను వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

పార్టీ పెద్దలతో జరిగిన చర్చలు గేమ్ చేంజర్ అని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన స్వతంత్య్ర భారతదేశంలోనే మొట్టమొదటిదని సీఎం తెలిపారు. ఈ సర్వే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు దారి తీసిందని, రాహుల్‌గాంధీ నాయకత్వంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు.

ప్రజా ఉద్యమాల ద్వారా సమాజంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఇప్పుడు ఓబీసీలకు న్యాయం, సాధికారత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని సీఎం పేర్కొన్నారు. 

తెలంగాణ కుల సర్వే దేశానికి ఆదర్శం

కులగణనకు అంగీకరించిన మోదీ.. రిజర్వేషన్ల పరిమితిని తొలగించడం లేదెందుకు: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 

దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరగాలని ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లొంగి కులగణనకు అంగీకరించిన మోదీ ప్రభుత్వం, 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. తెలం గాణలో  నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఖర్గే ఎక్స్ వేదికగా ఉద్ఘాటించారు.

తెలంగాణ సర్వే ఆధారం గా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థ ల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేస్తోందని తెలిపారు. బీసీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదు రు చూస్తోందనివెల్లడించారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో కృషి చేసిన  జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని బృందాని కి ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని తెలిపారు. 

రాహుల్‌గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పా ర్టీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల  గళంగా కాంగ్రెస్ పనిచేస్తోందని  స్పష్టం చేశారు. కార్పొరేట్ బోర్డులు, న్యాయ వ్య వస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యా సంస్థల్లో వర్ణహీనత కొనసాగుతోందని ఖర్గే ఆవేద న వ్యక్తం చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా అన్యాయం జరుగుతోం దని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్ర స్తావించామని ఆయన గుర్తు చేశారు. 80 శాతం ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు, 80 శాతం ఎస్టీ పోస్టుల ఖాళీగా ఉన్నాయని ఖర్గే వివరించారు.