25-07-2025 01:02:40 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయంగా చేపట్టిన కులగణన సర్వే దేశవ్యా ప్తంగా కులగణనకు రోల్‌మోడల్‌గా నిలిచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశంసించారు. కులగణన నిర్వహణ సుల భం కాదని, కానీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రభుత్వం అంచనాలకు మించి రాణించిందని రాహుల్‌గాంధీ అభినందించారు.
దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, అసెంబ్లీ ఆమోదం తదితర అంశాలపై ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సరైన డేటా ఆధారంగా సామాజిక న్యా యం, సాధికారిత కోసం విధానాలు రూ పొందించవచ్చని, తెలంగాణ ప్రభుత్వం ఈ డేటాను సాధించిందన్నారు. ఈ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింద న్నారు. వీటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.
తెలంగాణ ప్రభు త్వం నిర్వహించిన ఈ సర్వేలో 94,863 మంది ఎన్యూమరేటర్లు, 9,628 మంది సూ పర్‌వైజర్లు 56 ప్రశ్నలతో క్షేత్రస్థాయిలో ఇం టింటికి వెళ్లి 3.55 కోట్ల మంది జనాభా (96.9శాతం) డేటాను సేకరించారని తెలిపా రు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లో డిజిటలైజేషన్ పూర్తిచేశారని చెప్పారు.
సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.5 శాతం (బీసీ ముస్లింలు 10.08 శాతం ), ఎస్సీలు 17.45 శాతం, ఎస్టీలు 10.08 శాతం, ఉన్నత కులాలు 10.09 శాతం ఉండగా, 3.09 శాతం కులం లేనివారిగా పేర్కొన్నారని చెప్పారు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చసే శక్తి ఒక విద్యకే ఉందన్నారు.
ధనం, భూమి ఎవరి చేతిలో ఉందో స్పష్టమైంది
తెలంగాణ ప్రభుత్వం చేప్టటిన కులగణనతో ధనం, భూమి ఎవరి చేతుల్లో ఉందో స్పష్టమవుతోందని, ఇప్పుడు పూర్తి డేటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. సరైన డాటా చేతిలో ఉంటే ఏదైనా చేయగలమని, క్షేత్రస్థాయి డేటా ఇప్పుడు తెలంగాణ సర్కార్ వద్ద సి ద్ధంగా ఉందని, ఇండియాలో ఏ రాష్ట్రంలో పూర్తిస్థాయి డేటా లేదని చెప్పారు. ‘ఇప్పుడు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాల్సిన అవసరం ఉంది.
కానీ బీజేపీ మా త్రం 50 శాతం పరిమితి ఉండాలని కోరుకుంటుంది. 50 శాతం పరిమితి ఎత్తివేతకు ఆ పార్టీ భావజాలం వ్యతిరేకం. బీజేపీ ప్రభు త్వం కులగణనను కూడా సరైన రీతిలో చే యదు. అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి బీజేపీ ఇష్టపడదు. హిందీ, ప్రాం తీయ భాషలు ముఖ్యం కాదని నేను చెప్పట్లేదు.
ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భా ష లు కూడా ముఖ్యమే. బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లీషు తీసేయాలని అంటున్నారు. బీజేపీ నేతలను అడగండి.. వారి పిల్లలు ఏ భాషలో చదువుతున్నారో. దళిత, ఆదివాసీల పిల్లలు ఇంగ్లీషులో ఎందుకు చదవకూడదు.’ అని రాహుల్‌గాంధీ నిలదీశారు.
మోదీ కన్వెర్టెడ్ ఓబీసీ: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే దేశానికి ఒక దిక్సూచిలా నిలిచిపోతుందని తెలిపారు. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ అని..అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ మాత్రమే బీసీల కోసం త్యాగాలు చేస్తుందన్నారు.
తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ప్రజెంటేషన్ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఆమోదించి న బిల్లు, పార్లమెంట్‌లో ఈ బిల్లు చట్టబద్దత కోసం చర్చించాల్సిన అంశాలపై సీఎం వివరించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన పై అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, వారిని ఒప్పించామని సీఎం పేర్కొన్నా రు.
ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని, ఎవరి జనాభా ఎంతో తేల్చామన్నారు.
ఇది 88 కోట్ల పేజీ ల్లో నిక్షిప్తమై ఉం దన్నారు. కులగణన దేశం మొత్తం చేయాలన్న రాహుల్ పోరాటంతో కేంద్రం దిగివ చ్చి, రానున్న జనాభా లెక్కలతో పాటు కులగణనకు ఒప్పుకుందన్నా రు. రాహుల్‌పోరాటం చేయడం వల్లే రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు.
సోనియా రాసిన లేఖ నాకు ఆస్కార్, నోబెల్ లాంటిది
కులగణను తెలంగాణ మోడల్ అని కా కుండా రేర్ మోడల్ అని కూడా అనవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎందుకంటే స్వా తంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ ఇలా కులగణన చేయలేదన్నారు. సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ లేఖ రాశారని, ఇది తనకు ఆస్కార్, నోబెల్ బహుమతి లాంటిదని రేవంత్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
సోనియాగాందీ లేఖ తనకు లైఫ్ టై మ్ అచీవ్ మెంట్ అని, ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేసినా, వేరే కుర్చీలో కూ ర్చున్నా వీటన్నింటికంటే సోనియాగాంధీ రాసిన లేఖనే తనకు గొప్ప అని సీఎం వ్యాఖ్యానించారు. మీది కాంగ్రెస్ పార్టీ కాకపోయినా సీఎం ఎలా అయ్యారని అందరూ అడుగుతున్నారని, రాహుల్‌గాంధీ ఆత్మతో తన ఆత్మ కలిసిందన్నారు.
రాహుల్‌గాంధీ మనసులో అనుకున్న పనిచేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. అనుకున్నవన్నీ చేశానని అందుకే ఇప్పుడు తెలంగాణ మోడల్ గురించి దేశమంతా చర్చ జరుగుతోందని చెప్పారు. రాహుల్‌గాంధీ ఏదైనా చెప్పారంటే అది తనకు బంగారు గీత అని సీఎం పేర్కొన్నారు.
కులగణన ఓ చరిత్ర :భట్టి విక్రమార్క
తెలంగాణలో కులగణన ఓ చరిత్ర అని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దాదాపు 2 లక్షల మంది సిబ్బందితో 50 రోజుల్లో ఈ సర్వే నిర్వహించా మ ని, తెలంగాణ మొత్తాన్ని ఆరు బ్లాక్‌లుగా విభజించి, 150 ఇళ్లకు ఒక్కో ఎన్యుమరేటర్‌ను నియమించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే చేశామని వివరించారు. కులగణన సర్వేను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని, నివేదికపై నిపుణుల కమిటీని సైతం వేశామన్నారు. నిపు ణుల కమిటీ కొన్ని కీలక సూచనలు చేసిందన్నారు.
కులగణనకు చట్టబద్ధత:మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రభుత్వం చేబట్టిన కులగణన శా స్త్రీయంగా జరిగిన, జరిపిన కులగణన అ ని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటినా అది చట్టబద్దం అవు తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. చట్టపరంగా ఎటువంటి చిక్కులు ఏర్పడ్డా తట్టుకుని అంతిమంగా విజయం సా ధిస్తామనారు. బీసీలకు విద్యా, ఉద్యోగం తో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం కల్పి స్తూ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ర్టపతికి పంపినా నాలుగు నెలలుగా అవి పెం డింగ్ లో ఉండడం బాధాకరమన్నారు.