calender_icon.png 26 December, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అటల్ జీ జయంతి వేడుకలు

26-12-2025 12:00:00 AM

ఖమ్మంలో ఉత్సాహంగా సాగిన 2కే రన్

ఖమ్మం టౌన్, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): భారత రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన ధ్రువతార, మాజీ ప్రధా నమంత్రి అటల్ బిహారీ వాజపేయి 100వ జయంతి (శతజయంతి) ఉత్సవాలను గురువారం ఖమ్మం నగరంలో ఘనంగా నివా ళులర్పించింది. ఈ సందర్భంగా నగరంలో 2కే రన్ ర్యాలీని నిర్వహించారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడి ఆశయాలను స్మరి స్తూ, యువతలో స్ఫూర్తిని నింపే లక్ష్యంతో సాగిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.

అటల్ బీహార్ వాజ్పే యి శతజయంతి ఉత్సవ సమితి అధ్యక్షులు దిద్దుకూరు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఖమ్మం నగ రంలోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ 2కే రన్ ర్యాలీ ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. వం దలాది మంది యువకులు, విద్యార్థులు, రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారిం ది.

వాజపేయి చిత్రపటాలతో, జాతీయ జెం డాలతో అలంకరించిన ఈ ర్యాలీని ప్రముఖులు జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ జిల్లా పరిషత్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు,తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకి వా సుదేవరావు, నల్గొండ జిల్లా ఇన్చార్జి మాజీ అధ్యక్షులు ఉదయ ప్రతాప్ తదితరులు వాజ్పేయి సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో అటల్ బీహార్ వాజ్పేయి రాష్ట్ర సమన్వయ కన్వీనర్ జి.విద్యాసాగర్, సుబ్బారావు,నంబూరు రామలింగేశ్వర రావు, కొత్త వెంకటేశ్వరావు, వీరెల్లి రాజేష్, సరస్వతి, రజినీ రెడ్డి, అనిత, అల్లిక అంజయ్య, జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.వన్ టౌన్ లో వాజ్పేయి గారి శతజ యంతి ఉత్సవాలను స్థానిక ఖమ్మం 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ అధ్యక్షతన గుర్రాల బొమ్మ సెంటర్ నందు బీజేపీ నా యకులు, స్థానికులు, కార్యకర్తల తొ కలిసి నిర్వహించి వారికి ఘనమైన నివాళులు అర్పించారు.

ఇప్పుడు యువత ప్రతి ఒక్కరు వాజ్పేయి స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లొ జిల్లా మీడియా కన్వినర్ నెల్లూరి బెనర్జీ, జిల్లా నాయకులు బండ్ల రిగాన్ ప్రతాప్, తుమ్మ శివ, పొట్టిమూతి జనార్దన్,మద్దిన్ని వెంకటేశ్వర్లు, బం డారు శ్రీను, మండల నాయకులు పాలేపు రాము, బొడ్ల శ్రీను, కడదుల ప్రభాకర్, ము మ్మడి నరేష్ దేవి, స్వప్న, లోడంగి సత్యనారాయణ, రామ్మోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొనటం జరిగింది.