calender_icon.png 26 December, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

26-12-2025 12:00:00 AM

బూర్గంపాడు,డిసెంబర్25, (విజయక్రాంతి):క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బూర్గంపాడు మండలంలోని సారపాక, రెడ్డిపాలెం,మోరంపల్లి బంజర్, పినపాక పట్టి నగర్, ముసలమడుగు,కృష్ణ సాగర్,మోతె తదితర గ్రామాల్లో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలు, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలివచ్చి ఏసు క్రీస్తుకు ప్రార్థనలు చేశారు.

ప్రార్థనల అనంతరం ఫాధర్ ఆంటోని మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని, గ్రామాల్లో ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఏసు దేవుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

గ్రామాలన్నింటిలో పండుగ వాతావరణం నెలకొని ఆనందోత్సాహాలతో క్రిస్మస్ వేడుకలు కొనసాగాయి.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,కృష్ణ సాగర్ సర్పంచ్ తాటి వాణి, ముసలమడుగు సర్పంచ్ పూనెం సురేందర్, ఉప సర్పంచ్ లు భూక్య మోహన్ రావు,చప్పిడి కుమారి,బాదావత్ లోక్య తదితరులు పాల్గొన్నారు.