calender_icon.png 26 December, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సీపీఐ శత వసంతోత్సవాలు

26-12-2025 12:00:00 AM

ఉత్సావాలను సిద్ధమైన కార్యాలయాలు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 25, (విజయక్రాంతి):భారత గడ్డపై సిపిఐకి వందేళ్లు నిండిన సందర్బంగా జిల్లా వ్యాపితంగా పెద్దఎత్తున ఉత్సావాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. గురువారం అయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంతోపాటు, మం డల, పట్టణ కేంద్రాల్లో పెద్దఎత్తుని ఉత్సావాలు నిర్వహిస్తున్నామని, ఉత్సావాల సందర్బంగా ర్యాలీలు, సదస్సులు, జెండావిష్కరణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయిలో కొత్తగూడెం పట్టణంలో ఓల్ డిపో సెంటర్ నుంచి పోస్టాఫీసు సెంటరు వరకు భారీ ర్యాలీ, రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సావాల సందర్బంగా పార్టీ కార్యాలయాలను వి ద్యుత్ దీపాలు, పార్టీ తోరణాలతో సుందరంగా అలంకరించామని తెలిపారు.

జాతీయ స్థాయి ముగింపు ఉత్సావాలు ఖమ్మం నగరంలో జనవరి 18న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపా రు, ఐదు లక్షల మందితో భారీ బహిరంగసభ, ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల, ప ట్టణ కేంద్రాలతోపాటు గ్రామాలు, బస్తీల్లో జెండావిష్కరణలు జరపాలని, అమరవీరుల స్తూపాలను అలంకరించి ఉత్సావాలు నిర్వహించి వారి త్యాగాలను స్మరించుకోవాలి పార్టీ శ్రేణులకు సూచించారు.