calender_icon.png 11 November, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి ‘తైకాండో’కు క్రీడాకారులు

12-08-2024 12:00:00 AM

ఆదిలాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ర్టస్థాయి తైకాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10న జోగులాంబ గదాల జిల్లాలో జరిగిన 13వ రాష్ర్టస్థాయి తైకాండో చాంపియనిప్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అన్నారపు వీరేష్, శివకుమార్, వనితా రాథోడ్, దివ్య ప్రతిభను కనబరిచి నాలుగు వెండి పతకాలు, కాంస్య పతకం సాధించారు. అక్టోబరులో ఆగ్రాలో జరిగే జాతీయస్థాయి తైకాండో పోటీలకు వారు  ఎంపికయ్యారు.