calender_icon.png 20 September, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి విశ్వవిద్యాలయానికి గుర్తింపు తేవాలి

20-09-2025 12:00:58 AM

 రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి 

 డిచ్పల్లి  సెప్టెంబర్ 19:( విజయ క్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల కబడ్డీ (పురుషుల)  సెలెక్షన్స్ ను ఈ రోజు ఉదయం 11. గంటలకు వర్సిటీ క్రీడా మైదానంలో ప్రారంభించామని డైరెక్టర్ స్పోరట్స్ డా. బాలకిషన్ తెలిపారు. ఈ సెలెక్షన్స్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. యం. యాదగిరి, అతిథులుగా వర్సిటీ కళాశాల  ప్రిన్సిపాల్ డా. ప్రవీణ్ మామిడాల గారు, మరియు డా. పున్నయ్య, డైరెక్టర్ పి. ఆర్. ఓ. గారు లు పాల్గొని సెలెక్షన్స్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి డాక్టర్ ప్రవీణ్ మామిడాల గారు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ప్రతీ రోజూ క్రీడా మైదానం లో ప్రాక్టీస్ చేయాలని, క్రీడల ద్వారా వ్యక్తి పరిపూర్ణ వికాసం చెందుతారన్నారు. ముఖ్యఅతిధిగా రిజిస్ట్రార్ ప్రో. ఎం. యాదగిరి  మాట్లాడుతూ వర్సిటీ క్రీడలను క్రీడా కారులను ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో క్రీడలకున్న  ప్రాధాన్యతలను గుర్తించి  వర్సిటీ క్రీడా విభాగంలో  సౌకర్యాల బలోపేతానికి  కృషి చేస్తున్నామని చెప్పారు. 

క్రీడాకారులు ప్రతిరోజు  ప్రాక్టీస్ చేస్తూ  నైపుణ్యతను పెంపొందించు కోవాలన్నారు. ఇందులో సెలెక్టైన క్రీడాకారులు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ 2025 రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్గావి కర్ణాటక లో 4 నుండి 7 అక్టోబర్ 2025 లో పాల్గొని  సువర్ణ అవకాశం ఉంటుందన్నారు. కావున మంచి ప్రతిభ ప్రదర్శించి యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, డా. బి. బలమని, అనిల్ కుమార్, మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్. బి. ఆర్. నేత నరేశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.