calender_icon.png 20 September, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

20-09-2025 12:00:00 AM

గచ్చిబౌలి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మాదాపూర్ శిల్పారామం వేదికగా రాష్ట్ర హ్యాండ్లూమ్ ఎక్స్ పో ఘనంగా ప్రారంభమైంది. వీవర్స్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న.

ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర నలుమూలల నుంచి చేనేత కళాకారులు తమ ప్రత్యేక చేనేత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. వస్త్రాల వైవిధ్యం, సంప్రదాయ నైపుణ్యం, ఆధునిక రూపకల్పనలతో కూడిన విభిన్న చేనేత ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు. స్థానిక కళాకారుల శ్రమ ఫలితమైన ఈ ప్రదర్శన హస్తకళల పట్ల అవగాహన పెంచడమే కాకుండా, వారి జీవనోపాధికి తోడ్పడనుందని ఆయన తెలిపారు.