20-09-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని ఆసిఫాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవి డిమాండ్ చేశారు. సంగారెడ్డి బార్ సోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని చేపడుతున్న నిరాహార దీక్ష చేస్తే పోలీసులు అతన్ని అరెస్టు చేయడం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ క్రిమినల్ కోర్టు లోని న్యాయవాదులు భోగ అనిల్, హనుమాన్ నాయక్ లపై కక్షిదారులు దాడి చేయడానికి నిరసిస్తూ ఆసిఫాబాద్ న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవి మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ బార అసోసియేషన్ తెలంగాణ స్టేట్ పిలుపుమేరకు న్యాయవాదులు విధులు బహిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చరణ్, న్యాయవాదులు సతీష్ బాబు, ముక్త సురేష్, డి సురేష్, నికోడి రవీందర్, కే కిషోర్, అజ్మీరా గణపతి, రామకృష్ణ, రౌనక్ అగర్వాల్, చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో
మంచిర్యాల: రాష్ర్టంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్‌ని వెంటనే అమలుపరచాలని బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ నిరాహార దీక్షలో జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండవరం జగన్, ట్రెజరర్ దత్తాత్రేయ, స్పోర్ట్స్ సెక్రటరీ రంగు వేణు కుమార్, లైబ్రరీ సెక్రటరీ రంజిత్ కుమార్ గౌడ్, ఈసి మెంబర్ పెసర శ్రీకాంత్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు గాజుల రమణారెడ్డి, సంతోష్ గౌడ్, సెల్వరాజ్, అగల్డ్యూటీ సత్యనారాయణ పాల్గొన్నారు.
దీక్షలో కూర్చున్న న్యాయవాదులకు ఆసిఫాబాద్ జిల్లా బార్ అసోసియేషన్, బెల్లంపల్లి, లక్షేట్టిపేట్, చెన్నూర్ బార్ అసోసియేషన్లు, మంచి ర్యాల మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రావు, కొత్త సత్తయ్య, కర్రె లచ్చన్న, గడిగొప్పుల మురళీధర్ తదితరులు సంఘీభావం తెలిపారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
లక్షేట్టిపేట: నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యా యవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ, న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను పునరావృతం కాకుండా రక్షణ చట్టం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, రెడ్డిమల్ల ప్రకాశం, కారుకూరి సురేందర్, గాండ్ల సత్యనారాయణ, గడికొప్పుల కిరణ్ కుమార్, నగురు రవీందర్, పద్మ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.