11-10-2025 02:40:49 PM
బెల్లంపల్లి అర్బన్: భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధూకర్ ప్రభుత్వ హత్యకు నిరసనగా శనివారం బెల్లంపల్లి పోచమ్మ టెంపుల్ సెంటర్లో బిజెపి శ్రేణులు బిజెపి శ్రేణులు కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ గడ్డ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మధూకర్ ఆత్మహత్యకు కారణమైన వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రబట్ల సంతోష్, గాలి మధు, కమలను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి మధుకర్ ని మానసికంగా హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించిన నిల్వాయి SI ఎస్సై నీ వెంటనే సస్పెండ్ చేయాలనన్నారు. లేనియెడల ఎవరి అండదండలు చూసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారో ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు గాదర్ల నాగేష్ ,ముత్తే రాములు ఉపాధ్యక్షులు గజెల్లి రఘు, నాస్పూరి లక్ష్మణ్ ,హరికృష్ణ కార్యదర్శి సాయి బిజెవైం మండల అధ్యక్షులు ఎంబాడి సతీష్, మండల నాయకులు మహేష్ ,రాజు ,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.