11-10-2025 02:34:20 PM
మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో 44 వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, ఆకిటి నవీన్ రెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ కు వినతిపత్రం సమర్పించారు. రహదారి మీద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైందని, దీంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి గుంతలు పూడ్చి వేయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరగడం వల్ల రోడ్డు మీదకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారన్నారు. అంతేగాక దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. నిబంధనల ప్రకారం ఫ్లై ఓవర్ నిర్మించాలన్నారు.