11-10-2025 02:39:06 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఆహార, ప్రధాతల పట్ల దేశాన్ని నిర్మించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు సోదర సోదరీమణులకు 42 వేల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ప్రాజెక్టులను అందించుటకు ప్రధానమంత్రి ధర్ధాన్య వ్యవసాయ పథకము, పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ ప్రారంభోత్సవాన్ని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ పూస, న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు పథకాన్ని ప్రారంభించారు.
ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ, చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ, కార్యాలయంలో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ తిలకించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, రైతు సోదర సోదరీమణులకు, 42 వేల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ప్రాజెక్టుల బహుమతులు, అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పశుసంవర్ధన మచ్చ మరియు ఆహార ప్రాసెసింగ్ రంగానికి చెందిన 1100 కి పైగా ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు తెలిపారు.
న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగే ప్రత్యేక కృషి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులతో ప్రధానమంత్రి సంభాషించారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి, రైతు సంక్షేమం, వ్యవసాయ స్వయం-సమృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం పట్ల ప్రధానమంత్రి నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు అండగా నిలవడం, రైతు కేంద్రంగా చేపట్టిన కార్యక్రమాల్లో సాధించిన కీలక విజయాలను గుర్తించడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది, అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో రైతులకు తెలియపరచారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, డైరెక్టర్లు, ఆకిడి గంగారెడ్డి, నాగం శంకరయ్య, రవీందర్ రెడ్డి, గంగారెడ్డి,సిబ్బంది,శశి, పలు గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.