calender_icon.png 7 October, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

07-10-2025 06:54:32 PM

మందమర్రి (విజయక్రాంతి): రామాయణం మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజాలింగు పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన ఆది కవి మహర్షి వాల్మీకి, మానవ సంబంధాలను వాటి విలువలను  ప్రజలకు వివరించారని కొనియాడారు.

బందిపోటుగా జీవనం ప్రారంభించిన వాల్మీకి ఋషిగా మారి మహాకావ్యాన్ని ప్రపంచానికి అందించారని ప్రతి ఒక్కరు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రామాయణంలో పొందు పరిచిన మానవ సంబంధం, బంధాల విలువలను అనుసరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, రెవిన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, మేనేజర్ టి రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ ఏ రాణి, ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ వసంత్, సీనియర్ అసిస్టెంట్ ఈ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్లు బి విమల రాణి, పి పున్నం చందర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి శ్యాం బాబు, సిస్టం మేనేజర్ ఏ శిరీష్, ఇన్చార్జి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏ రఘురాం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.