calender_icon.png 4 May, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతి స్థిమితం లేని దళిత యువకుడిపై దాడి...

03-05-2025 06:13:11 PM

నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్.. 

మాదాసి సురేష్..

హనుమకొండ (విజయక్రాంతి): మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి చేసిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం కమలాపూర్ మండలం గూనిపర్తి లో మాట్లాడుతూ... ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలో బేడ బుడగ జంగానికి చెందిన‌ మతిస్థిమితం లేని యువకుడు అజయ్ కుమార్, ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించాడనే కారణంతో కొందరు వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునేలా కాళ్లు చేతులు కట్టివేసి బట్టలూడదీసి నగ్నంగా ఊరేగింపు చేస్తూ దాడి చేయడం అమానుషమని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలోనూ దళితులపై దాడులు నిత్యకృతంగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు మోరే ఐలయ్య, మోరే సుభాష్, ముత్యాల వెంకటేష్, గిన్నారపు బాబు, మోరే జయ, మోరే సౌందర్య, మోరే శ్రీలత తదితరులు పాల్గోన్నారు.