03-05-2025 06:16:01 PM
అతి త్వరలో మంచినీటి సరఫరా ప్రారంభం...
10 కోట్ల రూపాయల ఖర్చుతో రెండు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్..
30 వేల జనాభాకు నీటి సరఫరా..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి...
పటాన్ చెరు/అమీన్ పూర్ (విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీలో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నూతన రిజర్వాయర్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. శనివారం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, జలమండలి అధికారులతో కలిసి రిజర్వాయర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదేళ్ల క్రితం వరకు అమీన్ పూర్ పరిధిలో నిత్యం మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారిని తెలిపారు. 2014 నుండి నేటి వరకు ప్రణాళికాబద్ధంగా నూతన రిజర్వాయర్లు నిర్మిస్తూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలిపారు.
పెరుగుతున్న జనాభాకు అనుభవంగా నూతన కాలనీలకు సైతం మంచినీరు అందించేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బంధం కొమ్ములో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో 10 కోట్ల రూపాయలతో 8 కిలోమీటర్ల పైపు లైన్ సామర్థ్యంతో 30 వేల మంది జనాభాకు మంచినీటిన అందించేందుకు రిజర్వాయర్ నిర్మించినట్లు తెలిపారు. అతి త్వరలో రిజర్వాయర్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టగా మూడింటిని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, జలమండలి జిఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, డీజిఎం చంద్రశేఖర్, మేనేజర్ పూర్ణేశ్వరి, సీనియర్ నాయకులు గోపాల్, ఉపేందర్ రెడ్డి, రాజు, కొల్లూరి మల్లేష్, యూసుఫ్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.