calender_icon.png 4 May, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూ అనుబంధ పీజీ సెంటర్ లలో పొలిటికల్ సైన్స్ కోర్సును ప్రారంభించాలి

03-05-2025 06:11:12 PM

కె.యు.రాజనీతీ శాస్త్ర విభాగధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్యకు వినతిపత్రం..

హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ అనుబంధ పీజీ సెంటర్ లు అయిన ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్ లతో పాటు ఇతర పీజీ సెంటర్ లలో ఎం.ఏ పొలిటికల్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టి,  పేద విద్యార్ధులకు, సుదూర ప్రాంత విద్యార్ధులకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ క్యాంపస్ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్యకి కేయూ పరిశోధక విద్యార్థులు ప్రతినిధి బృందంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

భావిభారత విద్యార్థుల కు రాజనీతి శాస్త్రం కోర్స్ ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేయూ రాజనీతి శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థులు డా.మోహన్ రెడ్డి, తాళ్ళపెల్లి నరేష్, బి.నరసింహరావు, మాదాసి రమేష్, కె.ప్రసాద్, కల్లేపెల్లి ప్రశాంత్, జి.సురేష్, అంకిళ్ల శంకర్, కవిత, అరుణ, రుబీనా తదితరులు పాల్గొన్నారు.