26-05-2025 06:48:48 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై ఎస్ఐ గోపతి సురేష్(SI Gopathi Suresh) సిబ్బందితో కలిసి సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో చుంచు రత్నాకర్, దుర్గం భీమలింగు, ఆవునూరి శంకరయ్య, అనే ముగ్గురు పేకాటరాయుళ్లను పట్టుకోగా ఒకరు పరార్ అయ్యారని అన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... పట్టుకున్న నిందితుల నుండి రూ.1860/-తో పాటు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టుబడ్డ నిందితులు కాండ్రపు తిరుపతి పారిపోయినట్టు తెలిపారు. ఈ దాడిలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణ, ప్రేమ్ కుమార్ ఉన్నారు.