calender_icon.png 15 July, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీ సెంటర్ ను పరిశీలించిన ఏటీసీ చైర్మన్..

26-05-2025 06:52:21 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(Advance Technology Center)ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇనిస్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీ (IMC) చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి(Chairman Baluri Govardhan Reddy) పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం, టాటా ఫౌండేషన్ సంయుక్తంగా 40 కోట్లతో అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5 కోట్ల, టాటా ఫౌండేషన్ వాటా 35 కోట్లతో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ ను పరిశీలించి, పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

జూన్ మాసం వరకు ఈ సెంటర్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా, ఆగస్టు నెల వరకు పూర్తి కానుందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఐటిఐ కళాశాలను అప్గ్రేడ్ చేయలనే ఉద్దేశ్యంతో ఏటీసీ సెంటర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సెంటర్ కోసం ఆదిలాబాద్ జిల్లాకు ఓ ఎలక్ట్రికల్ కారు సైతం రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రశాంత్, విక్రం తదితరులు ఉన్నారు.