20-09-2025 01:03:02 AM
దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి
25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో న్యాయవాదుల న్యాయ దీక్ష
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): రాష్ట్రంలో న్యాయవాదులపై జరు గుతున్న దాడులను అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తిం చి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు శుక్రవారం తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యం లో కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో చేపట్టే న్యాయవాదుల న్యాయ దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన అసోసియేషన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరిక ట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమ లు చేయాలన్నారు. జూనియర్ అడ్వకేట్లకు రూ. 15 వేలు స్టయిఫండ్ ఇవ్వాలని డిమాం డ్ చేశారు. 41 ఏ సిఆర్పిసి (35(3) బిఎన్‌ఎస్‌ఎస్) అమెండ్‌ను చేయాలన్నారు.
న్యాయ వాదుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న ధర్నా చౌక్ లో చేపట్టే దీక్షకు న్యాయవాదులంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ, గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నందగోపాల్, అనంతయ్య, న్యాయవాదుల సంఘం నాయకులు సయ్యద్ మొహినో ద్దీన్, తులసిరాం, గిరీష్, శ్యామ్, సూర్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలి
రాష్ట్రంలోని ఎస్టీ హాస్టళ్లలో గత 16 నెలలుగా పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
దసరా వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, అప్పటివరకు బిల్లులు చెల్లించకపోతే వేలాది మంది విద్యార్థులతో ప్రజా భవన్ ముట్టడిస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జి. అనంతయ్య, నందగోపాల్, శివకుమార్ యాదవ్, నరేష్ గౌడ్, రవి యాదవ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.