calender_icon.png 13 July, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులపై దాడులు తగదు !

08-07-2025 12:00:00 AM

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. గౌరవించదగినది. ఎం దుకంటే వారు రేపటి పౌరులైన విద్యార్థు ల భవిష్యత్తు కోసం కష్టపడతారు. మంచి పౌరులను తీర్చిదిద్దుతారు. అందుకే పెద్ద లు గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చుతారు. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నిస్వార్థంగా కృషి చేసే జ్ఞానదాతలు గురువులు. వారు ఎప్పటికీ ఇంకి పోని చెరువులు.

అందుకే కవి కబీర్ ‘నా ముందు దేవుడు, ఉపాధ్యాయుడు ఇద్దరు వస్తే నేను నమస్కారం చేసేది మాత్రం ఉపాధ్యాయుడికే’ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అం చెలంచెలుగా ఎదిగారు. దేశానికి రాష్ట్రపతిగా సేవలందించారు. అందుకే జయంతి రోజైన సెప్టెంబర్5న దేశవ్యాప్తంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుం టాం. మనకు రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం తర్వాత కూడా విద్యార్థులకు ఎంత దగ్గరగా ఉన్నారు.

నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచించేవారు. సభల్లో వారిని ఉద్దేశించి వందల ఉపన్యాసాలు ఇచ్చారు. చివరకు అలాంటి ఒక సెమినార్‌లో ప్రసంగిస్తూ ప్రాణం విడిచారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఒకప్పటి ఉపాధ్యాయురాలే. ఇలా ఎందరో ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. మంచి ఉపాధ్యాయులు ఒక మంచి సమాజానికి తయారు చేయగలరు.

ఉపాధ్యాయులను గౌరవప్రదంగా చూసుకోవడం, వారికి మర్యాద ఇవ్వడం పౌరుల కనీస బాధ్యత. పిల్లలు హోమ్‌వర్క్ చేయకపోవడం, పాఠాలు చదవకపోవడంపై ఉపాధ్యాయులు కాస్త మందలిస్తే తల్లిదండ్రులు  వారిని దూషించడం, భౌతిక దాడులు చేయడం లాంటి ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఉపాధ్యాయులను విద్యార్థుల ఎదుట చులకనగా చూపడం వల్ల వారి గౌరవం తగ్గి, విద్యావ్యవస్థ దెబ్బతింటుందనేది ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.

గురువులు రేప టి తరాన్ని తీర్చిదిద్దే మహత్తర బాధ్యత కలిగినవారు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు దాడులు, దౌర్జన్యాలు చేయడం సరికాదు. ఉపాధ్యాయుల కుంగుబాటు సమాజానికి మేలు చేయదు. ఉపాధ్యాయులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. పిల్లలు సాధించిన విజయాలను చూసి ఎంతో సంతోషిస్తారు.  

సంస్కరించడం ముఖ్యం..

తల్లిదండ్రులు భౌతికంగా మనకు జన్మనిస్తే మానసికంగా జన్మనిచ్చే వారు ఉపా ధ్యాయులు. తల్లిదండ్రులకు తమ పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. కానీ, ఆ పని వారు చేయలేరు. వారు పూర్తి గా ఉపాధ్యాయులనే నమ్ముతారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తిలా కరిగిపోతూ వి ద్యార్థులను ఉత్తమోత్తములుగా తయారు చేస్తారు. ప్రతి రంగంలో నిపుణులను తయారు చేసేది ఉపాధ్యాయులే.

కానీ, వారికి తక్కువ వేతనాలు అందుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో యజామాన్యాలు వారికి వేతనాలు ఇచ్చి ఊడిగం చేయిస్తున్నాయి. కొందరు విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపకుండా తరగతి గదిలోనే మొబైల్ వాడుతూ కాలక్షేపం చేస్తుం టారు. మరికొందరు సక్రమంగా హోం వర్క్ చేయరు. ఇంకొందరు పక్కన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

మితిమీరిన అల్లరి చేసే వారూ ఉంటారు. అలాంటి వారిని సంస్కరించే విధి ఉపాధ్యాయులదే. మరి అలాంటి విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించకుండా ఎలా ఉంటారు? కాబట్టి తల్లిదండ్రులు ఆ కోణం లో ఆలోచించాలే తప్ప ఉపాధ్యాయులపై దాడులకు దిగడం సరికాదు. దాడులు ఉపాధ్యాయులను శారీరకంగా, మానసికంగా గాయపరుస్తాయి. కొన్నిసార్లు విద్యార్థులు తరగతి గదిలో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించవచ్చు.

ఉపాధ్యాయు లను దూషించవచ్చు. దాడుల వల్ల ఉపాధ్యాయులు భయాందోళనలకు గురై, డిప్రెషన్‌లోకి జారుకునే ప్రమాదం ఉంది.  శారీరక దాడుల వల్ల దెబ్బలు తగలడం, మానసిక దాడుల వల్ల మానసిక సమస్య లు ఏర్పడవచ్చు. దాడుల తర్వాత.. బాధిత ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించలేకపోవచ్చు. దాడులు సమాజంలో విద్యావ్యవస్థపై నమ్మకాన్ని తగ్గిస్తాయి. 

టీచర్ వృత్తి వెనుక కష్టం..

టీచర్ అవ్వాలనే ప్రతి అభ్యర్థి డైట్ సెట్ చదువుతాడు. డిగ్రీ తర్వాత బీఈడీ, పీజీలో అయితే డీఈడీ చేస్తాడు. ప్రభుత్వం వేసే ఉపాధ్యాయ కొలువుకు ప్రిపేర్ అవుతాడు. అనంతరం డీఎస్సీ రాస్తే అందులో మంచి మెరిట్ సంపాదిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు వస్తుంది. అనంతరం ప్రభు త్వం మన కేటాయించే స్కూల్‌కి వెళ్లి అక్క డ పిల్లలకు పాఠాలు చెప్తారు. మరి ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా కొలువు రాని వారందరూ ఏం చేయాలి.. ?వారంతా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తారు. చాలీచాలని జీతంతో బతుకీడుస్తా రు. ప్రస్తుత కాలంలో విద్య బోధనంతా డిజిటలైజ్ అయింది.

ఒకప్పుడు చెట్ల కింద కూర్చోపెట్టి.. చక్కగా బ్లాక్ బోర్డుపై చదువు చెప్పేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో కార్పొరేట్ వ్యవస్థ డిజిటల్ విద్య అమలు చేస్తున్నది. ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకవైపు తరగతి గదిలో పాఠాలు చెప్తూనే మరోవైపు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి.

దాడులను అరికట్టాలి..

ప్రస్తుతం దూరవిద్య అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో కోర్సులకు సంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అభివృద్ధి అయింది. ఇలాంటి సందర్భంలో కొందరు భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి ఉండే అవకాశం ఉండక పోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ విద్య వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో తగ్గుతున్నదని మరికొందరు భ్రమ పడుతున్నారు.

సమాజా నికి ఉపాధ్యాయుడి అవసరం ఎప్పటికీ ఉంటుంది. గురువు లేని విద్య ఎన్నటికీ రాణించదు. ఎంత సాంకేతికత వచ్చినా గురువు ఎదురుగా ఉండి పాఠాలు బోధిస్తేనే విద్యార్థులు సరిగ్గా అర్థం చేసుకుం టారు. ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన విధి. ప్రభుత్వాలు ఒక్క గురుపూజోత్సవం సం దర్భంగానే కాక అనేక పండుగలు పబ్బాలకు ఉపాధ్యాయులను సత్కరించాలి. ఉపాధ్యాయులు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడాలి. 

ఉపాధ్యాయులపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతు న్న తల్లిదండ్రులు, బంధువులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ వృత్తి కి  ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించకూడదు. ఉపాధ్యాయులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన వారిపై బీఎన్‌ఎస్ 353 చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయి.  ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు, శిక్షలు ఎదుర్కొనక తప్పదు.

న్యాయస్థానాలు నిందితులకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. జైలు శిక్ష సంవత్సరం వరకు ఉండొచ్చు. జరిమానా విధింపు దాడి తీవ్రతను బట్టి ఉంటుంది. అవసరమైతే ఉపాధ్యాయులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాడి చేయడం, తన్నడం, దూషించడం మొదలైనవి శారీరక దాడుల కిందకు వస్తా యి. బెదిరించడం, అవమానించడం మొదలైనవి మానసిక దాడుల కిందకు వస్తాయి.

ఒకవేళ ఉపాధ్యాయుడు దాడికి గురైతే, వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. యాజమాన్యాలు కూడా సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులపై దాడులు చేసే రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఏ పదవికి పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు, ఉపాధ్యా యులు కోరుతున్నారు.

ఉపాధ్యాయులపై దాడులు దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగినంత గౌరవం లభిస్తేనే ఉపాధ్యాయ వృత్తికి విలువ ఉంటుందని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు గురువులను గౌరవించేలా తీర్చిది ద్దాలంటున్నారు. యాజమాన్యాలు అందుకు భద్రతా సిబ్బందిని నియమించాలని, పాఠశాల పరిసరాల్లో సీసీ కెమె రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 - వ్యాసకర్త సెల్: 92908 26988