calender_icon.png 14 July, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ రూరల్ సీఐగా తిరుపతయ్య

13-07-2025 09:38:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districtబాన్సువాడ రూరల్ సీఐగా తిరుపతయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ బ్రాంచ్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతయ్య బాన్సువాడ రూరల్ సీఐగా బదిలీపై వచ్చారు. గతంలో కామారెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్(Special Branch)లో విధులు నిర్వహించి బదిలీపై బాన్సువాడకు రావడం జరిగింది. ఇంతకుముందు బాన్సువాడ రూరల్ సీఐగా విధులు నిర్వహించిన రాజేష్ హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ తిరుపతయ్య మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు బంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. రూరల్ పరిధిలో గుట్కా, గంజాయి, డ్రగ్స్, వంటి మారకద్రవ్యలపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.