calender_icon.png 14 July, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ

13-07-2025 09:06:00 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ఓ వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ చేస్తూ తన దాతృత్వన్ని చాటుకున్నారు. గోదావరిఖని పట్టణనికి చెందిన మీసాల సతీష్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తన భార్య మీసాల ఆశ్లేషతో కలిసి రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో నిరుపేద కుటుంబనికి చెందిన ఐదు కుటుంబలకు సుమారు రూ.20 వేల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఆ నిరుపేదలు సతీష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిడి కుమార్, మీసాల జ్యోతి, సత్య, వెంకట్, సతీష్ రెడ్డి, హర్షరెడ్డి ఎల్లనగిరి రోహిత్ రెడ్డి, రాజేందర్, బత్తుల నరేష్ సత్యనారాయణ, గంధం బాపురావు, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.