calender_icon.png 14 July, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

13-07-2025 08:50:58 PM

పెన్ పహాడ్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం అనంతారంలో ఆదివారం చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తండా సైదులు(29) శనివారం రోజువారి పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లి పని ముగించుకుని ఆటోపై తన స్వగృహానికి తిరిగి వస్తుండగా అనంతారం గ్రామ శివారుకు రాగానే ఒక్కసారిగా పశువులు పొదల నుంచి రోడ్డుపైకి రావడంతో ఆటో డ్రైవర్ పశువులను తప్పించబోయిన క్రమంలో ఆటోలో ఉన్న మృతుడు సైదులు ప్రమాదశాత్తు కింద పడిపోయాడు. ఈ నేపథ్యంలో సైదులుకు తలకు బలమైన గాయాలు కావడంతో క్షతగాత్రుని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఉన్నారు. కాగా మృతిని తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.