calender_icon.png 13 September, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీల్లో 75శాతం హాజరు తప్పనిసరి

13-09-2025 03:09:13 AM

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి) : రాష్ర్టంలోని ఉన్నత విద్యాసంస్థల్లో 75 శాతం హాజరును తప్పనిసరిగా అమలుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో పాల్గొన్న అనంతరం మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 శాతం హాజరు నిబంధన కొత్తదేం కాదని, ఇకపై దానిని కఠినంగా అమలు చేయబో తున్నామని చెప్పారు.

విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులను అప్రమత్తం చేయాలని వర్సిటీలకు సూచించారు. ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరును అమలుచేసేందుకు వర్సిటీలు అంగీకరించాయని తెలిపారు. పీజీ కోర్సుల అడ్మిషన్స్‌లో సీపీగెట్‌లోను స్పోర్ట్స్ కోటాను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కమ్యూనికేటివ్ ఇంగ్ల్లిష్ కోర్సును ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్ లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించామని వివరించారు.