calender_icon.png 2 July, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా పెరిగిన అరబిందో ఫార్మా నికరలాభం

11-08-2024 03:25:52 AM

హైదరాబాద్, ఆగస్టు 10: హైదరాబాద్ కేం ద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా నికరలాభం భారీ పెరిగింది. 2024 జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ కన్సాలిడేటెడ్  నికరలాభం 61 శాతం వృద్ధిచెంది రూ.919 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.571 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాము విక్రయాలు జరిపే అన్ని మార్కెట్లలో నూ వృద్ధి సాధించామని శనివారం అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి తెలిపారు. స్థూల మార్జిన్లు, నిర్వహణా సామర్థ్యాలు మెరుగుపడ్డాయని, ఇటీవల ప్రారంభించిన ప్లాంట్ల నుంచి ఉత్పత్తిని పెంచామన్నారు. తాజా త్రైమాసికం లో కంపెనీ ఆదాయం రూ. 6,851 కోట్ల నుంచి రూ. 7,567 కోట్లకు చేరింది.