calender_icon.png 10 November, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్

12-12-2024 12:22:57 AM

మూడో వన్డేలో భారత్ ఓటమి

  1. మంధాన సెంచరీ వృథా

పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కంగారూలతో జరిగిన వన్డే సిరీస్‌లో 3 వైట్‌వాష్‌కు గురైంది. బుధవారం పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో హర్మన్ సేన 83 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

అన్నాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110) సెంచరీతో రాణించగా.. అష్లే గార్డనర్ (50), తాహిలా (56*) అర్థ తకాలతో రాణించారు. హైదరాబాదీ బౌలర్ అరుంధతీ రెడ్డి 4 వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (105) సెంచరీతో రాణించినప్పటికీ మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అష్లే గార్డనర్ 5 వికెట్లతో చెలరేగింది.