calender_icon.png 10 November, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయత్రి జోడీ ఓటమి

12-12-2024 12:19:04 AM

హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను భారత డబుల్స్ ద్వయం గాయత్రి గోపిచంద్ జాలీ ఓటమితో ఆరంభిం చారు. టోర్నీలో భాగంగా బుధవారం గ్రూప్ తొలి మ్యాచ్‌లో గాయత్రి జంట 22 20 14 చైనా నంబర్‌వన్ జోడీ లియు షెంగ్ నింగ్ చేతిలో పరాజయం చవి చూసింది. పారిస్ ఒలింపిక్స్‌లో రజ తం సాధించిన చైనీస్ జోడీ తమ అనుభవాన్ని ప్రదర్శించి వరుసగా రెండు గేములు గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. గాయత్రి జోడీ తర్వాతి మ్యాచ్‌లో పియర్లీ టాన్ తిన్నాహ్ మురళీథరన్ (మలేషియా) జంటను ఎదుర్కోనుంది.