calender_icon.png 20 December, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడిలైడ్‌లో రెండోరోజూ ఆసీస్‌దే

19-12-2025 12:00:00 AM

  1. పోరాడుతున్న ఇంగ్లాండ్

ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 213/8

అడిలైడ్, డిసెంబర్ 18 : యాషెస్ సిరీస్ మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. బ్యాట్‌తో రాణించి భారీస్కోరు చేసిన కంగారూలు బంతితోనూ ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టారు. ఫలితంగా భారీ ఆధి క్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 326/8తో రెండోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 371 పరుగులకు ఆలౌటైంది. మిఛెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ అలెక్స్ క్యారీ 106 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

జోఫ్రా ఆర్చర్ 5 , కార్స్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నిం గ్స్ ఆరంభించిన ఇంగ్లీష్ టీమ్‌ను కంగారూ పేసర్లు దెబ్బకొట్టారు. గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చిన కమ్మిన్స్ 3 వికెట్లు తీయ గా.. బొలాండ్, లియోన్ రెండేసి వికెట్లు తీశా రు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో పోప్ 3, క్రాలే 9, రూట్ 19 పరుగులకే ఔటవగా.. బ్రూక్ 45, డకెట్ 29 రన్స్‌తో పర్వాలేదనిపించారు. ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్  8 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. స్టోక్స్ 45, ఆర్చర్ 30 పరుగులతో క్రీజులో ఉన్నా రు. ఇంగ్లాండ్ ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. 

డీఆర్‌ఎస్ రచ్చ రచ్చ

ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ డీఆర్‌ఎస్ నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. క్యారీ బ్యాట్‌కు బంతి తాకినట్టు స్పష్టంగా కనిపించినా స్నికో మీటర్‌లో స్పైక్ నమోదు కాలేదు. దీంతో బతికిపోయిన క్యారీ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్నాడు.

అటు ఈ రివ్యూ విషయంలో తప్పు జరిగినట్టు అంగీకరించిన ఐసీసీ ఇంగ్లాండ్‌కు రివ్యూను తిరిగి ఇచ్చినట్టు తెలిపింది. అటు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇలాంటి తప్పిదమే జరిగింది. జేమీ స్మిత్ బ్యాట్‌కు బంతి తగలకున్నా స్నికోమీటర్‌లో స్పైక్ రావడంతో అతన్ని ఔట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్నికోమీటర్‌ను నిషేధించాలని డిమాండ్ చేశాడు.