calender_icon.png 20 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెక్‌గ్రాత్‌ను దాటేసిన నాథన్ లియోన్

19-12-2025 12:00:00 AM

టెస్టుల్లో ఆసీస్ స్పిన్నర్ అరుదైన రికార్డ్

అడిలైడ్, డిసెంబర్ 18 : ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథ న్ లియోన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ బౌలర్‌గా రికా ర్డులకెక్కాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో లియో న్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఇప్పటి వరకూ ఆ ఆసీస్ స్పిన్నర్ 141 మ్యాచ్‌లలో 564 వికెట్లు తీశా డు. గతంలో ఈ ఈ రికార్డు ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. మెక్‌గ్రాత్ 563 వికెట్లు తీయగా.. లియోన్ తాజాగా దానిని దాటేశాడు.

అగ్రస్థానంలో దివంగత స్పిన్నర్ షేన్‌వార్న్ 708 వికెట్లతో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో లియోన్ ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మురళీధరన్ 800 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. షేన్ వార్న్, ఆండర్సన్, కుంబ్లే, బ్రాడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరంతా రిటైరవగా.. లియోన్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే తన రికార్డును బ్రేక్ చేసిన సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న మెక్‌గ్రాత్ రియాక్షన్ వైరల్‌గా మారింది. లియోన్ వికెట్ తీయగా మెక్‌గ్రాత్ సర దాగా కుర్చీని విసిరేస్తున్నట్టు రియాక్షన్ ఇచ్చాడు.