29-07-2025 12:00:00 AM
ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్, జూలై 28 (విజయక్రాంతి): మహబూబా బాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు స్టేజి వద్ద ఆదివారం అర్ధరాత్రి బావి లో ఆటో పడ్డ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఒకే కుటుం బానికి చెందిన శ్రీరాం నరసయ్య(80), శ్రీరా మ్ మార్కండేయ, శ్రీరామ్ భారతమ్మ ము గ్గురు ఆదివారం తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లి అర్ధరాత్రి ఆటోలో తిరిగి వెళ్తున్నారు.
శ్రీరామ్ మార్కండేయ ఆటో నడపుతుండగా నరసయ్య, భారతమ్మ వెనకాల కూర్చున్నారు. మునిగల వీడు స్టేజి వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. ఈ ఘటనలో నరసయ్య మృతిచెందగా.. మార్కండేయ, భారతమ్మ తీ వ్రంగా గాయపడ్డారు. భారతమ్మ పరిస్థితి వి షమంగా మారడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మార్కండేయను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.