28-07-2025 11:45:40 PM
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం టౌన్ పరిధి గొల్లగూడెం ట్రైబల్ ఆశ్రమ పాఠశాల(Gollagudem Tribal Ashram School)లో విద్యార్థిని ప్రతిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మంలో సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకొని, మృతి చెందిన ప్రతిమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.