29-07-2025 12:00:00 AM
కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): డయేరియా కంట్రోల్ సెల్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించే ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేయడం లేదు. వ్యాధులు విజృంభించి ఒక వైపు ప్రాణాలు పోతున్న కామారెడ్డి జిల్లా వాసులకు ఎమర్జెన్సీ అంటువ్యాధుల కంట్రోల్ వైద్య సేవలు అందడం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ లేక లక్షలాది మంది జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు.
24 గంటలు అంటువ్యాధుల నియంత్రణ సెల్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించి తగు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్న ఏర్పాటు చేయడంలో జిల్లా వైద్యశాఖ అధికారులు విఫలమవుతున్నారు. ప్రజలు విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్న 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందించే ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేయక వాంతులు వీరేచనాలతో అనారోగ్యం పాలవుతున్నారు.
గ్రామాలు, పాఠశాలలు, హాస్టల్లో, గురుకులాలలో, వాంతులు, విరోచనాలతో ప్రాణాపాయం కలుగుతున్న డిఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేయాల్సిన ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేయకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కలుషితనీరు, ఆహారం తీసుకుని అధిక సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, వాంతులు, విరేచనాలతో సతమతమవుతున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే కలాన్ గ్రామంలో డయేరియాతో ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు మృతి చెందారు. గ్రామాలలో, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో, ఉండే విద్యార్థులు వాంతులు విరోచనాలు సోకి పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎపిడమిక్ సెల్ అందుబాటులో ఉంటే వైద్య సేవలు 24 గంటలు అందించే అవకాశం ఉంటుంది. జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
డయేరియా కంట్రోల్ సెల్ లో ఒక డాక్టరు, ఏపీడమిలజిస్ట్, పలువురు పారామెడికల్ సిబ్బంది, సూపర్వైజర్లు, ఆరోగ్య సేవకులు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 24 గంటలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారు. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో కనీసం ఆలోచన లేకపోవడంతో జిల్లా వాసులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సెల్ ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, ఇతర వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా రోజు ఒకచోట వాంతులు, విరేచనాలతో పలువురు ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజలు డయేరియాతో వాంతులు విరోచనాలతో చనిపోతున్న అధికార గణం మొద్దు నిద్ర వీడడం లేదని జిల్లా వాసులు వాపోతున్నారు. వర్షాకాలంలో డిఎంహెచ్‌ఓ ఆఫీస్ లో ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఉన్న నెలకొల్పడం లేదని విమర్శలు ఉన్నాయి.
టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రాలలో ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అంటువ్యాధుల కంట్రోల్ కోసం రాపిడ్ రెస్పాన్స్ టీములు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఉన్న కామారెడ్డి జిల్లాలో అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి.
బోనాల పండుగలు, గ్రామాలలో జాతరలు, ఊర పండుగలు, జరుగుతూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డిఎంహెచ్వో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఏపీడమలజిస్ట్, వైద్య అధికారులు ,ఆరోగ్య సేవకులు, సూపర్వైజర్లు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసి అంటువ్యాధులను కంట్రోల్ చేయాలని ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.
పరిశీలిస్తున్నాం
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏపీ డామిక్ సెల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే ప్రత్యేక సెల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడు తున్నాం.
చంద్రశేఖర్, జిల్లా వైద్య శాఖ అధికారి, కామారెడ్డి,