ప్రభుత్వ వైద్యుడికి అవార్డు
03-12-2024 01:24 AM
కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు ఈట్టెం రవీంద్రమోహన్ సోమవారం హైదారాబాద్‌లో ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ సేవలకు గాను కేట్రాప్ట్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ వారిచే ఏషియన్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ఆసుపత్రి వైద్యు లు, నర్సింగ్ సిబ్బంది, ఎల్లారెడ్డి ప్రజలకు రవీంద్రమోహన్ కృతజ్ఞతలు తెలిపారు.






