05-12-2025 07:10:10 PM
టాప్ 10 మంది విద్యార్థులకు ఉచిత విద్యకు అవకాశం
హనుమకొండ,(విజయక్రాంతి): నవంబర్ 23న మోషన్ ఐఐటీ, నీట్ కాలేజీ హన్మకొండ బ్రాంచ్ లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో టాప్ 10 ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు శుక్రవారం మోషన్ కాలేజీ హన్మకొండ బ్రాంచ్ లో షిల్డ్స్, మెమంటో తో పాటు ఫ్రీ అడ్మిషన్స్ కోసం అగ్రిమెంట్ బాండ్ లు మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అందించారు. ఈ సందర్బంగా టాప్ 10 ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అభినందనలు తెలియజేశారు.
ఐఐటీ, నీట్ కోచింగ్ కు దేశంలోనే అగ్రగామి విద్య సంస్థ అయిన మోషన్ ఐఐటీ నీట్ ఇన్స్టిట్యూట్ హన్మకొండలో బ్రాంచ్ స్థాపించిన మొదటి బ్యాచ్ లోనే అనేక మంది ఐఐటీ, మెడికల్ సీట్లు సాధించి వరంగల్ నగరంలోనే అత్యుత్తమ కాలేజిగా గుర్తింపు పొందింది అని అన్నారు. ఇక్కడ బ్రాంచ్ లో ఐఐటీ, నీట్ కోచింగ్ లో నిష్ణాతులైన సీనియర్ కోటా అధ్యాపకులు, కోటా మెటీరియల్ అందివ్వడం జరుగుతుందన్నారు. మోషన్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఫీజులో 40% రాయతీ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.
ఈ అవకాశాన్ని ఈ సం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడ్మిషన్స్ మరియు మిగితా వివరాల కోసం 9703000850/851/852 నెంబర్ లకు గాని, మోషన్ కాలేజీ నయీమ్ నగర్ హన్మకొండ బ్రాంచ్ నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ ప్రిన్సిపాల్ ముత్యాల సురేష్, కోటా అధ్యాపకులు అనూప్ కుమార్, సురేందర్ సాహి, మిథున్, పాఠక్, రాజు, లక్ష్మణ్, మౌనిక, ఉమ తదితరులు పాల్గొన్నారు.