16-05-2025 06:52:37 PM
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు
హుజురాబాద్,(విజయక్రాంతి): డెంగ్యూ అంత మన పంతం అని జాతీయ దినోత్సవం పురస్కరించుకొని పురవీధుల గుండా తిరుగుతూ డెంగ్యూ వ్యాధిపై అవగాహన పెంచుతూ. డ్రై డే ఫ్రైడే ట్యూస్డే డెంగ్యూ అంతం మన అందరి బాధ్యత అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భారతదేశంలో మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారు అని
ఏడిస్ దోమకాటువల్లడెంగ్యూవస్తుందిజ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది. ముందు వాటిని తరిమేయాలి. ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి, చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. తాజానీటిని కూడా కాచి చల్లార్చి తాగాలి. నీటి ద్వారే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. శుద్ధమైన నీటినే తాగాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో హుజురాబాద్ ఆర్ ఎం ఓ డాక్టర్స్ సుధాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డాక్టర్ మధు, పంజాల ప్రతాప్, డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్య,డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ విజయకుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూపర్వైజర్ రత్నకుమారి, అరుణతో పాటు తదితరులు పాల్గొన్నారు.