22-08-2025 06:48:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలో నాణ్యత లేని మటన్ అమ్ముతున్నారని ఫిర్యాదుల మేరకు శుక్రవారం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దుకాణాలను సీజ్ చేశారు. ఇటీవలే కొందరు చేపల మార్కెట్ వద్ద మటన్ విక్రయిస్తున్న వ్యాపారులు నాణ్యతలేని మటన్ విక్రయిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్ తదితరులు ఉన్నారు