22-08-2025 10:13:24 PM
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన 157వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు ‘మెగా157’, ‘చిరు అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను ఈరోజు హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించారు. ఈ సినిమా టైటిల్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ అని ప్రకటించారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా.
శుక్రవారం టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కమ్‌బ్యాక్ తర్వాత మెగా స్వాగ్ చూడాలని ఒక కోరిక ఉండేది. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూశాను. ఫైనల్‌గా వచ్చింది. చిరంజీవిని అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబో ఎలా ఉంటుందో ఈసారి పండక్కి చూస్తారు. చిరంజీవి మేనరిజాన్ని అనుకరించనివాళ్లు ఎవరూ ఉండరు. మెగాస్టార్‌ను నా కంటితో ఎలా చూడాలనుకున్నానో అలా చూసే అవకాశం వచ్చింది.
ఈ గ్లింప్స్ జస్ట్ శాంపిలే. సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ లుక్ కోసం మేము చేసిందేమీ లేదు. ఇందులో చిరంజీవి లుక్ 95 శాతం ఒరిజినల్. ఆయన సినిమా కోసం బరువు తగ్గారు. నా అదృష్టం కొద్దీ అంత అద్భుతమైన లుక్ దొరికింది. ఈ క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుంది. ఆయన మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి లుక్‌ని మైంటైన్ చేస్తున్నారు. భీమ్స్‌కి ఐడియా చెప్పగానే చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సమీర్‌రెడ్డి విజువల్స్ అదరగొట్టారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నారు” అని చెప్పారు.
ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. “నాన్నగారి పుట్టినరోజున ఆయనతో లేకుండా మీ అందరి ముందు ఇలా ఉండడం బహుశా ఇదే ఫస్ట్ టైమ్. ఇది వెరీ స్పెషల్ మూమెంట్. ఇది నాకు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఇదే స్టుటైల్‌తో ఇంకా ఎనర్జీతో సంక్రాంతికి వస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మన మెగాస్టార్‌కి వెరీ హ్యాపీ బర్త్‌డే” అన్నారు.
‘యూత్ ఫ్యామిలీ ఫ్యాన్స్.. అన్ని జనరేషన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంద’ని ప్రొడ్యూసర్ సాహు గారపాటి అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. అనిల్ రావిపూడికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను’ అన్నారు.