31-07-2025 08:07:48 PM
కుభీర్: వర్షాకాలంలో వచ్చే వ్యాధులు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై కుబీర్ పిహెచ్సి ఆరోగ్య శాఖ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. గురువారం మండల కేంద్రం కుబీర్ లోని కస్తూర్బా గాంధీ, గిరిజన ఆశ్రమ పాఠశాల, ఎస్సీ హాస్టల్ లలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల వివరించారు. అనంతరం విద్యార్థులను పరీక్షించి మందు బిల్లలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.