31-07-2025 08:05:11 PM
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ అభిలాష బిస్ట్
వరంగల్,(విజయక్రాంతి): పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకుగా పోలీస్ డ్యూటీ మీట్‌లు ఎంతగానో దొహడపడుతాయని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పి.టి.సి మామూనూర్ వేదికగా ఎర్పాటు రెండవ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ అభిలాష్ బిస్ట, అడిషినల్ డీజీపీ మహేష్ భగవత్, ఈ డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు.
నేటి నుండి మూడు రోజుల పాటు జరగన్న ఈ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్‌లో రాష్ట్రంలో ఏడు జోన్లతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సిఐడి ఇంతెలిజెన్స్,యాంటీ నార్కోటిక్ బ్యూరో,సైబర్ సెక్యూరీటీ వింగ్, జి.ఆర్.పి, ఐటీఅండ్‌టి, అక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సూమారు నాలుగు వందలకుపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది సైటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్,కంప్యూటర్,డాగ్ స్వ్కాడ్, ప్రోపెషనల్ ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీ పడనున్నారు.