26-09-2025 09:08:19 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మహిళల భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ వంటి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచితుల మాటలు, సోషల్ మీడియాలో అనవసర పరిచయాలు నమ్మవద్దని సూచించారు. స్కూల్ పిల్లల ప్రవర్తన గమనించాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలపై వేధింపులు జరిగిన వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్ నంబర్ 8712667434 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.