26-09-2025 10:17:04 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో గత 25 రోజుల క్రితం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఇబ్రహీంపేట గ్రామంలో మాలమహానాడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ హానికి మరమ్మత్తులు చేయించడం జరిగింది.
మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి సిఐ అశోక్ లతో పాటు బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు ఇబ్రహీంపేట్ గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలతో కలిసి త్రీ శరన్ పంచశీల పూజ చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్పీ, సీఐ, ఎస్సై, లకు గ్రామ మాల మహానాడు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానం చేశారు. బాన్సువాడ డిఎస్పీ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల జోలికి దుండగులు గాని అల్లరి ముకలు గాని ఇలాంటి పనులు చేస్తే రౌడీ సీట్ ఓపెన్ చేసి బొక్కలో వేస్తామని డిఎస్పి గారు అన్నారు