26-09-2025 09:02:02 PM
బెజ్జంకి: ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక ఎన్నికల్లో అధికారులందరూ అప్రమత్తంగా విధులు వ్యవహరించాలని జెడ్పీ సీఈఓ రమేశ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు అధికారులకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ శిబిరానికి జెడ్పీ సీఈఓ రమేశ్ హజరై పలు సూచనలు చేశారు. అయా గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత అధికారులదే అని అన్నారు.