26-09-2025 10:20:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి కళాశాలకు తప్పనిసరిగా హాజరై అధ్యాపకులు బోధించిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఇంటి వద్ద తల్లిదండ్రులు సూచనలు పాటించాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తుకారం అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నిర్మల్ డిగ్రీ కళాశాలలో పోషకుల సమావేశం నిర్వహించి విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రగతి నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు కళాశాలకు పిల్లలు వచ్చే విధంగా చూడాలని సూచించారు కళాశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త విజయలక్ష్మి కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు